సేవ్ టెంపుల్స్ భారత్
దేవాలయో రక్షతి రక్షితః!
సేవ్ టెంపుల్స్ భారత్
సంస్థ ఆరంభం
డా.గజల్ శ్రీనివాస్ ( కేశిరాజు శ్రీనివాస్ ) అధ్యక్షత న 2015 సంవత్సరంలో పాలకొల్లు , ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన కేంద్రంగా సేవ్ టెంపుల్స్ భారత్ సంస్థ ప్రారంభం అయ్యింది. ఆ బాల్యం నుండి తన తండ్రిగారి, మరియు మేన మామలు RSS తో అనుబంధం వల్ల సనాతన ధర్మ రక్షణ, ఆ విధమైన ఆలోచనలు డా.శ్రీనివాస్ కు బాల్యం నుండి వుండేవి. ఆ సిద్ధాంత ప్రచారం కోసం, ధర్మ రక్షణ కోసం ఈ సంస్ధ ను స్థాపించడం జరిగింది.
దేవాలయో రక్షతి రక్షితః!
దేవాలయ రక్షణే ధర్మ రక్షణ
సేవ్ టెంపుల్స్ భారత్
ధర్మ పరిరక్షణే మా లక్ష్యం
సంస్థ ఆరంభం
ధర్మ రక్షణ కోసం ఈ సంస్ధ ను స్థాపించాం
విశిష్ట సేవా కార్యక్రమాలు
కుంభాభిషేకం
పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయ కుంభాభిషేక కార్యక్రమానికి సహకారం.
ఆలయ జీర్ణోద్ధరణ
అంబాజీపేట శ్రీ మేనకేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణకు ప్రేరణ.
గీతా సందేశం – 108 భాషల్లో
శ్రీమద్ భగవద్గీతను 108 భాషల్లో ఆడియో రూపంలో రూపొందించే మహత్తర సంకల్పం.
వకుళమాత పరిరక్షణ
తిరుపతి పెరూరు వకుళమాత ఆలయ రక్షణ ఉద్యమంలో కీలక పాత్ర.
నదీ ఆరాధన
గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా, నాగావళి నదుల వద్ద నదీహారతుల నిర్వహణ.
చలనచిత్ర పోటీలు
అంతర్జాతీయ లఘు చిత్ర, డాక్యుమెంటరీ పోటీల నిర్వహణ
పూర్వ రంగం
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర డల్లాస్ నగరంలో నివసించే హిందూధర్మ భక్తుడు, సేవ్ టెంపుల్స్ మరియు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయిన డా.వెలగపూడి ప్రకాశరావు గారి కోర్కె పైన డా.గజల్ శ్రీనివాస్ ఆ సంస్థలకు ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా బ్రాండ్ అంబాసిడర్ గా సేవలు అందించడానికి అంగీకరించి 2013 నుండి ఆ సంస్థకు అనుబంధ మయ్యారు. ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఒక కార్యా లయం కూడా ప్రారంభించి దేశ వ్యాప్తంగా ఎన్నో గొప్ప కార్యక్రమాలు విజయవంతంగా , స్ఫూర్తి దాయకంగా నిర్వహించారు.















