డా. గజల్ శ్రీనివాస్ (కేశిరాజు శ్రీనివాస్)
తెలుగు గజల్ గానానికి ఆద్యుడిగా గుర్తింపు పొందిన ప్రముఖ గాయకుడు, సామాజిక సేవకుడు మరియు సనాతన ధర్మ ప్రచారకుడు. తెలుగు భాషలో గజల్ గానాన్ని ప్రజలకు చేరువ చేసి ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆయనను తెలుగు గజల్ గాన పితామహుడిగా కూడా అభివర్ణిస్తారు.
ప్రపంచ రికార్డులు
100 భాషల్లో 100 పాటలు ఆలపించి గిన్నిస్ రికార్డు, 125 భాషల్లో 125 పాటలు పాడి మరో ప్రపంచ రికార్డు, 24 గంటల్లో అత్యధిక సంగీత కచేరీలు నిర్వహించి రికార్డు సృష్టించారు.
కమిటీ
డా.గజల్. శ్రీనివాస్ (కేశిరాజు శ్రీనివాస్)
అధ్యక్షులు
శ్రీ రాయప్రోలు భగవాన్
ఉపాధ్యక్షులు
శ్రీ మేడికొండ శ్రీనివాస్ చౌదరి
కార్యదర్శి
సేవ్ టెంపుల్స్ సంస్ధకు రాజీనామా
సమైక్య వాద ఉద్యమం లో డా.గజల్ శ్రీనివాస్ లోతుగా పాల్గొన్నప్పుడు రాష్ట్ర విభజన జరుగ కుండా వుండే ఒక సత్ సంకల్పం కోసం కొన్ని ప్రత్యేక కారణాల వల్ల డా.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సేవ్ టెంపుల్స్ సంస్థ లోని కొంతమంది సభ్యులు దీనికి అభ్యంతరం తెల్పిన సందర్భంలో డా.గజల్ శ్రీనివాస్ సేవ్ టెంపుల్స్ సంస్థ కు 2014 లేనే రాజీనామా చేసి, ధార్మిక యోగి అయిన డా. వెలగపూడి ప్రకాశరావు గారితో అనుబంధం కొనసాగించే దిశగా 2015 లో సేవ్ టెంపుల్స్ భారత్ ను శ్రీనివాస్ స్థాపించారు.
సేవ్ టెంపుల్స్, సేవ్ టెంపుల్స్ భారత్ కలసి పని చేయడం ప్రారంభించారు . కొంత కాలం తరువాత ఒక సుహృద్భావ వాతావరణం లో మాట్లాడుకొని విడివిడి గా వారి వారి కార్యక్రమాలు నిర్వహించాలని భావించి కొనసాగిస్తున్నారు.











